Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ వీర విహారం... 40వ సెంచరీతో కదంతొక్కిన కెప్టెన్

  • ఓవైపు వికెట్లు పడుతున్నా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • అండగా నిలిచిన విజయ్ శంకర్
  • ప్రస్తుత స్కోరు 231/6
నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మొక్కవోని స్థైర్యంతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ తన వన్డే కెరీర్ లో 40 వ సెంచరీని సాధించాడు. పాయింట్ మీదుగా చూడచక్కని బౌండరీతో శతకాన్ని పూర్తి చేశాడు.

అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ధావన్ 21, రాయుడు 18 కూడా నిరాశ పరిచారు. ఈ సమయంలో కోహ్లీకి అండగా నిలిచిన విజయ్ శంకర్ 46 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అనంతరం జాధవ్ 11, ధోనీ పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ప్రస్తుతం 110 బంతుల్లో 105 పరుగులతో (9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. జడేజా 15 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 2 వికెట్లు తీయగా, కమిన్స్, మ్యాక్స్ వెల్, లియోన్ లు చెరో వికెట్ తీశారు. భారత్ స్కోరు 44.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు.
kohli
century
Australia
india
nagpur
odi

More Telugu News